ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభవార్త చెప్పారు.
వైయస్సార్ రైతు భరోసా కింద ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 16వ తేదీన అంటే రేపు… తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఈ ఏడాది మొత్తం 48 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా గుర్తించింది జగన్ సర్కార్.వీరిలో 47 లక్షల మంది భూ యజమానులు కాగా 90 వేల మంది అటవీ సాగుదారులు ఉన్నారు.
రైతు భరోసా పథకానికి అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఇప్పటికే శుక్రవారం నుంచి ఆర్ బి కే లలో ప్రదర్శిస్తున్నారు. వచ్చే అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేర్లను తొలగించడంతో పాటు జాబితాలో చోటు దక్కని అర్హుల అభ్యర్థనలను స్వీకరించారు. అనంతరం ఫైనల్ జాబితాను విడుదల చేసి..రేపు డబ్బులు విడుదల చేస్తారు.
అలాగే రెండో విడత కింద మే 31 తేదీన ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 2000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇలా రెండు దఫాలుగా 7500 రూపాయలను వేసేందుకు సీఎం నిర్ణయించారు.
అలాగే జూన్ 19 తేదీన యానిమల్ ఆంబులెన్సు లను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలియ చేసింది. జూన్ 6 తేదీన కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద 3 వేల ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్ల పంపిణీ చేస్తారు. జూన్ 1 తేదీన వ్యవసాయనికి సాగునీటి విడుదల ప్రణాళికను కూడా ఇవ్వబోతున్నారు
ఈ సందర్భంగా మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే అదే రోజు నుంచి రాష్ట్రంలోని కాలువలకు నీళ్లు విడుదల చేయాలని నిర్ణయించారు.
కేబినెట్ నిర్ణయాలు:
• జూన్ 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానెల్ నుంచి నీటి విడుదల
•జూలై 15 నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలరాయలసీమకు జూన్ 30 నుంచి నీటి విడుదల
•ఉత్తరాంధ్రకు నీటి విడుదలకు సంబంధించి త్వరలోనే తేదీల ప్రకటన
•పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకునేందుకు వెసులుబాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది
• ఈ నెల 16 నుంచి రైతు భరోసా డబ్బులు చెల్లింపుకు ఆమోదం
• ఈ నెల 19న పశు అంబులెన్స్‌లు ప్రారంభం
•జూన్ 21న అమ్మ ఒడి నిధుల విడుదల