AP TENTH (10th) CLASS EXAM RESULTS 2023 | AP SSC EXAM RESULTS 2023 | @bseap.gov.in @manabadi @schools9
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని కసరత్తులను , ఏర్పాట్లను చివరి దశకు తీసుకొచ్చింది.
2023-24 సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థులు దాదాపుగా 8 లక్షల వరకు పరీక్షలు రాయడం,హాజరవడం జరిగింది.
3,76,890 మంది బాలురు,3,98,789 మంది బాలికలు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
ఈ సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాలను మే నెల 7 తేదీ లేదా 10 తేదీలోపు విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
ఇక ఏప్రిల్ 19వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్ష పత్రాలు మూల్యాంకనం అనేది ప్రారంభించారు దీనికి సంబంధించి ఉత్తర్వులు అందుకున్న అందరూ ఉపాధ్యాయులు కూడా విధులకు హాజరయ్యి పేపర్ కరెక్షన్ అనేది చేస్తున్నారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం కొరకు 11 జిల్లాల్లో 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ పది రోజులపాటు వ్యాల్యువేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఆ తర్వాత మే 4వ తేదీ వరకు విద్యార్థుల మార్కులను క్రోడీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత మే 5 తేదీ నుంచి 10వ తేదీలోప ఫలితాలు విడుదల చేసేదానికి విద్యాశాఖ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.