తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల లిస్ట్ విడుదల జరిగింది. దాదాపు పది లక్షల పైగా కొత్త పెన్షన్ మజురు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు.65ఏళ్లనుంచి 57ఏళ్లకు పింఛన్ అర్హత వయసును తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా 9,46,117మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు.
ప్రతి జిల్లాలో దాదాపుగా 50,000 నుంచి లక్షలు ఉండే విధంగా అధికారుల ప్రణాళికలు.జిల్లాలో ఎంతకాలంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పింఛన్లు మంజూరు చేస్తూ ఆసరా గుర్తింపు పత్రాలను మంత్రులు అందించారు.ప్రస్తుతం ఉన్న 35.95లక్షల పెన్షన్లతో కలుపుకుని ఈ సంఖ్య 45.41లక్షలకు చేరనుంది.
ఈ పెన్షన్లు అన్నీ కూడా ఆగస్టు 15వ తేదీన మంజూరు చెయ్యడం జరిగింది కొత్త పెన్షన్లన్నీ కూడా వచ్చేనెల సెప్టెంబర్ మొదటి వారం నుంచి పంపిణీ చేసేలా ప్రణాళికలను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు చేస్తూ ఉన్నారు.ఒక్కో ఇంటిలోని ఒక్కొక్కరికి వృద్ధాప్య పింఛన్‌గా రూ. 2016ను ప్రతీ నెలా క్రమం తప్పకుండా అందించరు.
ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో పెన్షనర్లకు సంబంధించిన కొత్త గుర్తింపు కార్డులను అందజేస్తున్నారు. ఈ గుర్తింపు కార్డుల మీద బార్కోడ్ మరియు క్యూఆర్ కోడ్ తో ఉన్న ఒక ప్రత్యేకమైన ఐడిని ఇవ్వడం జరుగుతుంది.తాజా ఉత్తర్వుల ప్రకారం లబ్దిదారులను గుర్తించి పెన్షన్ అందజేతకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ చర్యలు తీసుకున్నారు.
ఎన్నో సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్న ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని కెసిఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది.మరో 57ఏళ్లు దాటిన 7.8లక్షల దరఖాస్తులకు కూడా లైన్ క్లీయర్ అయింది. వృద్ధాప్య 68,186, వితంతు 1,68,582, దివ్యాంగులు 56,986, గీతకార్మికులు 6611, నేత కార్మికులు 3356, బీడి కార్మికులు 5665, ఒంటరి మహిళలు 11491, కళాకారులు 5485, పైలేరియా3727తోపాటు కొత్తగా 12వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు మంజూరీ అయ్యాయి.
ఈ పెన్షన్లలో ఐదు రకాల పెన్షన్ స్కీమ్ వాటిల్లో వికలాంగులు, వృద్ధాప్యం, వితంతు, ఒంటరి, కళాకారులు చేనేత కార్మికులు ఇతర ఇతర పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది.రాష్ట్రంలో ప్రస్తుతం 38.41లక్షల మందికి ఆసరా పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోంది. దివ్యాంగులకు రూ. 3016, ఇతర విభాగాల పెన్షనర్లకు నెలకు రూ. 2016లను ప్రభుత్వం చెల్లిస్తోంది.
D
List
Asarapenction
List. Want