YSR RAITHU BHAROSA Payment Status 2022 | Raithu Bharosa-PM kisan Status 2022
వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 50.58 లక్షల మంది రైతులకు..1036 కోట్లను సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.
జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాల ఫలితంగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో 2019 తో పోల్చితే 2020–21లో దాదాపు నూరు శాతం వృద్ది సాధించి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (జీజీఐ) ర్యాంకింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మొదటి స్ధానంలో నిలిచింది.
కాగా, రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా ప్రభుత్వం..రూ. 13వేల 500 అందిస్తోంది. తొలివిడతగా పంట వేసేముందు మే నెలలో 7వేల500, రెండో విడతగా అక్టోబరులోపు రూ. 4వేలు, మూడో విడుతగా సంక్రాంతికి రూ. 2వేలు ఇస్తోంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి రూ. 19,813 కోట్ల సాయాన్ని రైతులకు అందిస్తోంది.
సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి కింద ఏటా 13,500 రూపాయల రైతు భరోసా సాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వంవైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, కనీస మద్దతు ధరలకు పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్ యంత్రసేవా పథకం, రెండు లక్షల బోర్లు లక్ష్యంగా అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా బోరు, మోటర్ అందించేందుకు వైఎస్సార్ జలకళ వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా గత రెండున్నర ఏళ్ళలో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 86,288 కోట్లు.
Rytu bharosa