ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నవారికి 18750 ప్రభుత్వం అందజేస్తుంది.
దీనికిగాను ఇప్పటికీ వాలంటీర్లు అందరూ కూడా సర్వే నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 22వ తేదీన వైయస్సార్ చేయూత పదకం డబ్బులను సీఎం జగన్మోహన్ గారు లాంఛనంగా మూడో విడతను ప్రారంభించనున్నారు.
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ ఇస్తది అనేది కంపల్సరిగా తీసుకోవాలి మీ సేవ లేదా మీసేవ లేదా సచివాలయాల్లో కుల ధ్రువీకరణ పత్రం అంటే గ్యాస్ సర్టిఫికెట్ ఆదాయ ధ్రువీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా తీసుకొని మీ వాలంటీర్ కి ఇవ్వవలసి ఉంటుంది.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ కూడా సెప్టెంబర్ 5 వరకు చివరి అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 8 9 తేదీల్లో గ్రామ వార్డు సచివాలయంలో ఉండే అధికారులు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ లో అర్హులు అనరులను గుర్తిస్తారు వాటి యొక్క జాబితాలను
సెప్టెంబర్ 13 14 తేదీల్లో సచివాలయాల్లో పొందుపరచడం జరుగుతుంది.
సెప్టెంబర్ 17 18 తేదీలు తుది జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 22వ తేదీన సీఎం జగన్ గారి చేతుల మీదుగా వైయస్సార్ చేయూత పథకం లాంచనంగా మూడో విడత డబ్బులను మహిళల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
గతంలో వైయస్సార్ చేయూత ద్వారా డబ్బులు పొందిన మహిళలకు ఈసారి కేవలం వాలంటీర్ మరియు లబ్ధిదారుల యొక్క సెల్ఫీ ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు నిజమైన లబ్ధిదారులుగా ప్రభుత్వం భావించి గుర్తిస్తుంది ఎవరైతే ఫోటో దిగకుండా ఈ కెవిసి అనేది చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ ineligible లిస్టు / అనర్హుల జాబితాలో అయితే వెళ్ళడం జరుగుతుంది.
వైయస్సార్ చేత కొత్తగా దరఖా చేసుకోవడానికి దరఖాస్తు ఫారని కింద లింకులో ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకోండి.