TeluguWorks (Jan-01) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు నందు ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కొత్తగా పెళ్లయిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
అయితే ముందుగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా వాళ్ల తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి పేర్లు తొలగించుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో రేషన్ కార్డు నందు పేర్లు తొలగించుట కొరకు తప్పనిసరిగా ఈ దరఖాస్తు ఫారాన్ని నింపి మీ దగ్గరలో ఉన్న మీ మండల ఎంఆర్ఓ ఆఫీసులో లేదా ఎంపీడీవో ఆఫీసులో ఈ దరఖాస్తు ఫారాన్ని అందజేయవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారాన్ని అందజేసిన తర్వాత మీరు మీ సేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి 14 రోజుల్లోపు మీ పేరు మీ తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి తొలగించబడుతుంది.
ఈ రేషన్ కార్డు నందు పేర్లు తొలగింపు దరఖాస్తు ఫారాన్ని పెళ్లయిన కొత్తవారు లేదా చనిపోయిన వారి పేర్లు తొలగించడానికి అవకాశం కల్పించారు.
రేషన్ కార్డులోని పేర్లు తొలగించడానికి కావలసిన పత్రాలు
1.ఆధార్ కార్డు
2.కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు
3.గ్రూప్ ఫోటో (తొలగిపోయిన వ్యక్తి కాకుండా మిగిలిన సభ్యులు)
4.మరణ ధ్రువీకరణ పత్రం (అవసరమైన వారికి మాత్రమే)
5.మ్యారేజ్ సర్టిఫికేట్