ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ 2022 (Ap Tenth Supply Results 2022) పరీక్ష ఫలితాలను ఆగస్టు మొదటి వారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో దాదాపుగా నాలుగు లక్షల 50 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష (AP SSC Supplementary Exam 2022)లను జులై 6 నుంచి 15 వరకు నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలియజేసారు.
ఏపీ పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 13 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజును అందరూ విద్యార్థులకు మినహాయింపు ఇచ్చారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్‌ను విడుదల చేసి పరీక్షలు పూర్తి చేయడం జరిగింది.
ఈ సంవత్సరం ర్యాంకులకు స్వస్తి పలికి మార్కుల విధానాన్ని తీసుకోవడం జరిగింది
గతంలో మాదిరిగా ప్రతి విద్యార్థి కూడా ఏడు పరీక్ష పేపర్లు రాసే విధంగా చేసింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ గత సంవత్సరంలో ఇవి 11 పేపర్లుగా ఉండేవి.
ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకు మిమ్ములను జారీ చేయడం జరుగుతుంది ఫెయిల్ అయిన విద్యార్థులకు తర్వాతి సంవత్సరంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఏడాది ఆరు లక్షల 30 వేల మంది పరీక్షలకు హాజరుకంగా అందులో నాలుగు లక్షల 17వేల మంది మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అంటే కేవలం 67% మాత్రమే ఉత్తీర్ణత అనేది నమోదయింది ఇతర రాష్ట్రంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ శాతం ఉత్తీర్ణత ఉన్నట్టు మంత్రిగారు తెలిపారు.
ఈ సప్లమెంటరీ పరీక్ష ఫలితాల్లో గనుక విద్యార్థులు పాస్ అయితే తదుపరి తరగతులకు ప్రమోట్ చేయడం జరుగుతుంది.
ap SSC supply results 2022 పరీక్ష ఫలితాలను ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ నుంచి కొంత సమాచారం తెలుస్తోంది.