E crop booking Objective:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఈ క్రాప్ బుకింగ్ నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ఖరీఫ్ 2023 సీజన్ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడుతున్నాయి.

ఈ క్రాప్ బుకింగ్ ఎవరు చేస్తారు ? E-CROP BOOKING

ఈ క్రాప్ / ఈ పంట నమోదు అనే విధానం 1. గ్రామ స్థాయి 2.మండల స్థాయిలో చేయడం జరుగుతుంది.

1.గ్రామ స్థాయి e crop booking :-


గ్రామ స్థాయిలో నమోదు కొరకు VRO, గ్రామ సర్వేయర్,వ్యవసాయ అధికారులు రైతుల యొక్క వివరాలు నమోదు చేస్తారు.


2.మండల స్థాయి e crop booking:-


తహశీల్దార్,మండల వ్యవసాయ అధికారి ఈ ప్రతి రికార్డును బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించటం జరుగుతుంది.

E crop booking 2023 నమోదు అయిన వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో,గ్రామ సచివాలయం లో ప్రదర్శించడం జరుగుతుంది.

ఈ క్రాప్ బుకింగ్ ద్వారా లాభాలు ? E CROP BOOKING BENIFITS

e crop booking ద్వారా నమోదు అయిన ప్రతి పంటకు భవిష్యత్లో ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది.

ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే పంట నష్టం వాటిల్లితే వారికి రాష్ట్ర వ్యవసాయ అధికారులు తనిఖీ చేసి పంట నష్టపరిహారాన్ని రైతు ఖాతాలో డబ్బులు నేరుగా జమ చేయడం జరుగుతుంది.

ఈ పంట నమోదు చేపడుతున్న రెవెన్యూ,వ్యవసాయ అధికారులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సాగయ్యే అన్ని రకాల పంటలను నమోదు చేసి మొబైల్ నంబర్లకు మెసేజ్ రూపంలో సందేశాన్ని పంపించడం జరుగుతుంది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *