TeluguWorks, వెబ్ డెస్క్:-
Ration card ekyc status| మార్చి 31 తేదీ లాస్ట్ లేదంటే గోవిందా.!
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుల E-kyc ప్రక్రియ అనేది మొదలైంది. మార్చి 31వ తేదీలోపు రేషన్ కార్డు ఈ కెవైసి (ekyc) పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రేషన్ పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం మరియు రేషన్ షాపుల్లో డీలర్ దగ్గర ఉండే ఈ పాస్ మిషన్ల ద్వారా రేషన్ ఈ కేవైసీ చేస్తున్నారు. ఈనెల 31వ తేదీన గడువు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో ఇప్పుడు రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ వేగవంతం చేయడం జరిగింది.
రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆధార్ నెంబర్ ని దగ్గర ఉంచుకొని ఈకేవైసి ప్రక్రియలు మీ గ్రామ వార్డు సచివాలయం లేదా రేషన్ షాపుల్లో డీలర్ దగ్గర ఈకేవైసి పూర్తి చేసుకోవాలి.
ఇది చదవండి: రైల్వే జనరల్ టికెట్ కొత్త రూల్
ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది మరియు పథకాలు రావాలన్నా తప్పనిసరిగా రేషన్ కార్డు ekyc పూర్తి చేసి ఉండాల్సిందే…
