ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తరేషన్ కార్డులు జారీ మరియు పాత డిజైన్ లో మార్పులు కొత్త లుక్ ATM కార్డు సైజులో చేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన వెలువడించడం జరిగింది.
రేషన్ కార్డులో జరగబోయే మార్పులు::
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ (eKyc) ప్రక్రియ కొనసాగుతోంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుంది. కొత్తగా పెళ్లి అయిన వారికి, రేషన్ కార్డులో పేర్లు తొలిగింపు, పిల్లలని జాయిన్ చేయడానికి ఈ ఆప్షన్స్ అన్ని త్వరలో రాబోతున్నాయి.
రేషన్ కార్డు eKyc చివరి తేదీ ?
రాష్ట్రంలో దాదాపు 4000లకు పైగా రేషన్ దుకాణాలు అందుబాటులో ఉన్నాయి ప్రతి దుకాణం పరిధిలో 500 నుంచి 700 లోపు రేషన్ కార్డులు ఉండే విధంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కేవైసీ ప్రక్రియ చివరి తేదీ ఏప్రిల్ 30 గా నిర్ణయించింది. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రాబోయే రోజుల్లో కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది.ఈకేవైసీ (eKyc) పూర్తికాని వారికి ఇబ్బందులు తప్పవు.
కొత్తరేషన్ కార్డు డిజైన్ :
ఇప్పుడు జారీ చేసే ఈ కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి వాటిల్లో ప్రతి ఒక్క కుటుంబానికి క్యూఆర్ కోడ్ (QR Code) ఉండే విధంగా మార్పులు చేస్తున్నారు ఆ క్యూర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు ప్రదర్శింపబడతాయి. ఏటీఎం కార్డు సైజులో ఉండే రేషన్ కార్డుల్లో ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా ఉండడంతో మరియు పాత రేషన్ కార్డులు వాటి స్థానంలో వీటిని తీసుకురావడం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క కార్డుకి eKyc ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు సిద్ధం చేసి ఉంచారు.

కొత్తరేషన్ కార్డులు జారీ ఎప్పుడు?
ఈ కొత్త డిజైన్లు ఉన్న రేషన్ కార్డులు ప్రభుత్వం అందించే కొత్త ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే విధంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం eKyc పూర్తిచేసుకున్న వారికే కొత్త కార్డులు జారీ మరియు ఎంత మంది పేర్లు తొలిగిపోతాయి అనే లెక్కలు చూసుకొని రాబోయే రోజుల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ద్వారా కొత్త మరియు పాత పేర్లు జోడించడం, తొలగించడం ,కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ సులభతరంగా చేసేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.