Free Bus 2025 : ఏపీలో ఉచిత బస్సు కొత్త రూల్స్ – సొంత జిల్లాల వరికే పరిమితం

Free Bus 2025 : ఏపీలో ఉచిత బస్సు కొత్త రూల్స్ – సొంత జిల్లాల వరికే పరిమితం

Teluguworks: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణానికి కొత్త రూల్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఉగాది నుంచి రాష్ట్రంలో మహిళలకు బస్సు ప్రయాణాన్ని ఉచితంగా కల్పించే విధంగా రాష్ట్ర క్యాబినెట్ మరియు అసెంబ్లీలో బడ్జెట్ ని కేటాయించడం కూడా జరిగింది.

ఉచిత బస్సు ప్రయాణం రూల్స్ 20250307 114734 00003675484715360937878

మహిళా మంత్రి గారి కీలక ప్రకటన:-

గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు.

“ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల పరిధికి మాత్రమే” వర్తిస్తుందని మంత్రి తెలియజేశారు.

Also Read:-
అన్నదాత సుఖీభవ రైతులకు మొదటి విడత తేదీ ఖరారు

మార్చి 30 తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు సొంత జిల్లాల్లో ప్రయాణించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


ఏ పత్రాలు ఉండాలి ?

మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసే దానికోసం వారు తప్పనిసరిగా నివాస గుర్తింపు దృవీకరణ పత్రాన్ని చూపాల్సి ఉంటుంది. కింది వాటిలో ఏదైనా ఒకటి…

  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డ్
  • ఓటర్ కార్డ్
  • ఉపాధి హామీ పథకం కార్డు
  • బ్యాంకు పాస్ బుక్
  • ఏదైనా నివాస ధ్రువీకరణ పత్రం

జిల్లాలకే పరిమితం ఎలా ?

ఉదాహరణకు :- మీరు గుంటూరు జిల్లాలో నివాసితులే ఉన్నట్లయితే మీరు గుంటూరు జిల్లా ప్రాంతాల్లో ఉచితంగా ప్రయాణం చేయడం పూర్తిగా ఉచితం అలాగే మీరు గుంటూరు నుంచి పక్క జిల్లాకి అంటే కృష్ణాజిల్లా కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మహిళల కైనా టికెట్ తీసుకోవాల్సి అవసరం ఉంటుంది.

అదే విధంగా జిల్లాల బోర్డర్ దగ్గరలో ఉన్న వారికి ఈ నియమం వర్తించదు.

ఎప్పటినుంచి అమలుకు వస్తుంది ?

ఈ ఉగాది (మార్చి 30వ) తేదీ నుంచి రాష్ట్రంలో జిల్లాల్లో పరిధిలో మాత్రమే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు సమాచారం.