MGNREGA PAYMENT STATUS 2025|
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025 (కరువు పని) చేసిన ప్రతి ఒక్క కూలీలకు అమౌంట్ ఖాతాల్లోకి పడిందో లేదో చెక్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం రోజువారి కూలీ వివరాలు ? ఎన్ని రోజులు పని చేసినందుకు? ఎంత అమౌంట్ వచ్చింది ? అనే విషయాలు అది కూడా ఎలాంటి లాగిన్ లేకుండా కేవలం మీ జాబు కార్డు నెంబర్ (Job Card Number) ద్వారా తెలుసుకోవడం ఇప్పుడు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఇక్కడ మీకు రెండు రకాల లింకులు అవసరం అవి వరుసగా ఇస్తాను
- 1)మొదటి లింక్: జాబ్ కార్డు నెంబరు ఉపయోగించి మీ పేమెంట్ స్టేటస్ చూడడం ఎలా ?
- 2)రెండో లింక్ : మీ జాబ్ కార్డు నెంబర్ తెలుసుకోవడం ఎలా ?
NRGEA PAYMENT STATUS 2025
జాబ్ కార్డు నెంబరు ఉపయోగించి పేమెంట్ చూడడం ఎలా ?
- ముందుగా ఇక్కడ ఉన్న లింకు https://pfms.nic.in/SitePages/DBT_StatusTracker.aspx పై క్లిక్ చేయండి
- తర్వాత పేజీలో మీ కేటగిరి (Category ) క్లిక్ చేయండి.దానిలో NRGEA ఆప్షన్ ని ఎంచుకోండి
- ఆ తర్వాత పేమెంట్ (Payment ) ఆప్షన్ క్లిక్ చేయండి
- తర్వాత క్యాప్చర్ కోడ్ నమోదు చేయండి search
చెయ్యండి
- అంతే మీ పేమెంట్ వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి
ఇప్పుడు దానిలో మీకు , ఎప్పుడు ? ఏ తేదీన ఎంత అమౌంట్ ? మీ ఖాతాలోకి వచ్చింది ఇంకా బ్యాంకు నుంచి ఎంత అమౌంట్ రావాలి అనే పూర్తి వివరాలు మీరు చూసుకోవచ్చు. అలాగే కింద ఉన్న ఇమేజ్ లో కూడా అదే విషయం మీకు కనబడుతుంది.

KARUVU PANI 2025 PAYMENT STATUS
జాబ్ కార్డు నెంబర్ తెలుసుకోవడం ఎలా ?
- ముందుగా ఇక్కడ ఉన్న లింకు https://nregastrep.nic.in/ పైకి క్లిక్ చేయండి
- తర్వాత పేజీలో మీయొక్క రాష్ట్రాన్ని ఎంచుకోండి తర్వాత మీ జిల్లాని ఎంచుకోండి
- ఆ తర్వాత మీ బ్లాక్ లేదా మండలాన్ని ఎంచుకోండి ఆ తర్వాత మీ యొక్క పంచాయతీని ఎంచుకోండి
- ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్ చూస్తారు వాటిలో I.Job card Related Reports అనే దానిలో 3వది (3.Job Card/ Employment Register దాన్ని ఎంచుకోండి.
- ఇక్కడ మీ పంచాయతీలో ఉండే అందరి జాబ్ కార్డు నెంబర్లు మరియు వారి పేరు కనిపిస్తాయి వాటిల్లో మీ యొక్క పేరు ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకోండి.
- కింద ఉన్న ఇమేజ్లో ఉన్నట్లు మీకు పేర్లు, జాబ్ కార్డు నెంబర్లు వస్తాయి
