Railways : జనరల్ టికెట్లపై రైల్వే శాఖ కీలక ప్రకటన

Teluguworks: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే టికెట్ లపై కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. జనరల్ టికెట్లపై ఈ మార్పులు అయితే ఉండబోతున్నాయి గతంలో మాదిరిగా జనరల్ టికెట్లు తీసుకొని మీరు ప్రయాణం అయితే చేయవచ్చు.
కొత్తగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖలో మార్పులు అయితే చేయబోతూ ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థలు ఈ మార్పులు అయితే వస్తున్నాయి.
ముందుగా జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణం మూడు గంటల్లోపు ఏదైనా మీరు ట్రైన్ తీసుకొని మీ గమ్యస్థానానికైతే జనరల్ బోగీలో ఎక్కి ప్రయాణం చేయవచ్చు కానీ ఇప్పుడు వచ్చిన ఈ రూల్ ప్రకారం మీరు ఏ ట్రైన్ అయితే ఎక్కాలి అనుకుంటున్నారో ఆ ట్రైన్ కి సంబంధించి డీటెయిల్స్ అంటే వివరాలు మీరు తీసుకునే జనరల్ టికెట్ పై ముద్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేయబోతోంది.
దీని ద్వారా మీరు వెళ్ళవలసిన రైలు వచ్చే సమయానికే మీరు టికెట్టు తీసుకుని ప్రయాణించాలి ఒకవేళ మీరు ఎక్కవలసిన రైలు కనుక మిస్ అయితే అంటే ప్రయాణం చేయలేకపోతే ఆ టికెట్ తదుపరి ట్రైన్ కి వర్తించదు.
జనరల్ టికెట్లను కూడా ఇప్పుడు ముమ్మరంగా తనిఖీ చేయడానికి ఆయా రైల్వేస్టేషన్లో టికెట్ చెక్కర్స్ ని అంటే టీసీ(TC)లను రైల్వే డిపార్ట్మెంట్ మౌనంగా తనిఖీలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
ఇకనుంచి జనరల్ టికెట్ లో ప్రయాణం చేయాలనుకునేవారు తప్పనిసరిగా దీనిని గుర్తుపెట్టుకోండి మీరు తీసుకోబోయే ట్రైన్ దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు జనరల్ టికెట్లపై ప్రింట్ అయి వస్తాయన్నమాట.
